purandeswari: రైల్వే జోన్ ఇవ్వలేమని మేము చెప్పలేదు: పురంధేశ్వరి

  • రైల్వే జోన్ ఏర్పాటులో జాప్యం జరుగుతుందనే చెప్పాం
  • ప్రకాశంను వెనుకబడిన జిల్లాగా ఎందుకు గుర్తించలేదు?
  • ఏపీకి ఏమేం చేశారో చెప్పడానికి మోదీ వస్తున్నారు

విశాఖ రైల్వే జోన్ ను ఇవ్వలేమని తాము చెప్పలేదని ... జాప్యం జరుగుతుందని మాత్రమే చెప్పామని బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి అన్నారు. విభజన బిల్లులో ఉక్కు కర్మాగారాన్ని పొందుపరిచి, పట్టించుకోవడం లేదని మాట్లాడటం సరికాదని చెప్పారు. వేరే దేశాల వారితో ఇక్కడ ఉక్కు కర్మాగారాన్ని ఎందుకు పెట్టిస్తున్నారని ప్రశ్నించారు. ఏపీలో ఏడు వెనుకబడిన జిల్లాలు ఉన్నాయని... ఎనిమిదో జిల్లాగా ప్రకాశంను ఎందుకు గుర్తించలేదని అడిగారు. కేంద్ర ప్రభుత్వంపై చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టేందుకే వచ్చే నెల 6న ప్రధాని మోదీ ఏపీకి వస్తున్నారని చెప్పారు. గత నాలుగున్నరేళ్లుగా ఏపీకి ఏమేం అందించారో వివరిస్తారని తెలిపారు. ఒంగోలులో మీడియాతో మాట్లాడుతూ, ఆమై పైవ్యాఖ్యలు చేశారు. 

More Telugu News