New Delhi: ట్రాఫిక్ పోలీసును 200 మీటర్ల మేర ఈడ్చుకెళ్లిన మందుబాబు... వీడియో ఇదిగో!

  • న్యూఢిల్లీలో ఘటన
  • రాంగ్ రూట్ లో వచ్చిన కారును ఆపిన పోలీసు
  • కారును సీజ్ చేశామన్న పోలీసులు

తప్పతాగిన ఓ మందుబాబు, తన వాహనానికి అడ్డుగా ఉన్న ట్రాఫిక్ పోలీసును దాదాపు 200 మీటర్ల దూరం ఈడ్చుకుంటూ వెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. న్యూఢిల్లీ శివార్లలోని గురుగ్రామ్ సమీపంలోని సిగ్నేచర్ టవర్ చౌక్ వద్ద ఈ ఘటన జరిగింది.

రాంగ్ రూట్ లో వస్తున్న ఓ కారును ట్రాఫిక్ పోలీసు ఆపగా, వాహనదారుడు ఆపకుండా వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఆ కారు ముందుకు వెళ్లిన కానిస్టేబుల్ పైకి వాహనాన్ని ఎక్కించాలని చూశాడు. కారు బాయినెట్ ను కానిస్టేబుల్ గట్టిగా పట్టుకోగా, కారును దౌడు తీయించాడు. దాదాపు 200 మీటర్ల దూరం కారు వెళ్లింది. ఈలోగా మరో వాహనదారుడు ఆ కారుకు అడ్డుగా తన కారును తీసుకెళ్లడంతో మందుబాబు దొరికిపోయాడు. అతన్ని అరెస్ట్ చేశామని, కారును సీజ్ చేశామని పోలీసులు వెల్లడించారు.


More Telugu News