Rahul Gandhi: రాహుల్‌ 'ట్యూషన్'పై స్మృతిఇరానీ సెటైర్లు!

  • పీఎం పదవిపై కలలు కనేందుకు ట్యూషన్  
  • రాహుల్ కు చెందిన క్లిప్పింగ్ ట్విట్టర్ లో పోస్ట్ 
  • రాహుల్ ఏ పదవికీ పనికిరాడంటూ ఘాటు వ్యాఖ్యలు

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీపై కేంద్రమంత్రి స్మృతిఇరానీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రధాని పదవిపై కలలు కనేందుకు రాహుల్ ట్యూషన్ తీసుకుంటున్నారని సెటైర్లు వేశారు. రాహుల్ కు ఆ పార్టీ నేతలు ఎలా మాట్లాడాలో చెబుతున్న ఒక వీడియోను ట్విట్టర్ ఖాతాలో కేంద్రమంత్రి పోస్ట్ చేసి విమర్శలు సంధించారు. రాహుల్ తన సొంత మాటల కంటే పక్క వాళ్లు చెప్పేదాన్నే నమ్ముతారని వీడియోలో ఉన్న దృశ్యాలను బట్టి తెలుస్తుందన్నారు. అయినా రాహుల్ ఏ పదవికీ అర్హుడు కాదన్న విషయాన్ని దేశ ప్రజలు తెలుసుకోవాలని సూచించారు.

అసలేం జరిగిందంటే..
ఇటీవల మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో రైతు రుణమాఫీ చేశామంటూ రాహుల్ మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో జ్యోతిరాదిత్య సింధియా.. రాహుల్‌కు ఏవో సలహాలు ఇచ్చారు. ప్రధాని మోదీ ఏం చేయలేదో... దాన్ని కాంగ్రెస్ చేసి చూపించిందని చెప్పాలంటూ రాహుల్‌కు సింధియా గుర్తుచేశారు. అలాగే మీడియా ప్రతినిధులు కూడా ఎలాంటి ప్రశ్నలు అడగొద్దంటూ చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. <blockquote class="twitter-tweet" data-lang="en"><p lang="hi" dir="ltr">आजकल सपना दिखाने के लिए भी ट्यूशन लेनी पड़ती है ??? <a href="https://t.co/Z6ZL3MOQhq">pic.twitter.com/Z6ZL3MOQhq</a></p>— Smriti Z Irani (@smritiirani) <a href="https://twitter.com/smritiirani/status/1075033536992821254?ref_src=twsrc%5Etfw">December 18, 2018</a></blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>

More Telugu News