sriharikota: నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌11

  • శ్రీహరికోట కేంద్రం నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌11 ప్రయోగం
  • జీశాట్-7ఏను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్న వాహకనౌక
  • ఈ ఉపగ్రహం బరువు 2,250 కిలోలు

జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌11 నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోట ప్రయోగం కేంద్రం నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌11 ప్రయోగం జరిగింది. జీశాట్-7ఏ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి వాహకనౌక ప్రవేశపెట్టనుంది. కాగా, ఈ ఉపగ్రహం బరువు 2,250 కిలోలు. భారత్ పంపిస్తున్న35వ సమాచార ఉపగ్రహం జీశాట్-7ఏ. దేశీయ కమ్యూనికేషన్ ఉపగ్రహమైన జీశాట్- 7ఏ ఎనిమిదేళ్లపాటు సేవలందించనుంది. ముఖ్యంగా భారత వాయుసేన అవసరాల కోసం దీనిని వినియోగిస్తారు. 

More Telugu News