siricilla: రాబోయే మూడేళ్లలో సిరిసిల్లలో రైలుకూత వినిపించబోతోంది: కేటీఆర్

  • నేతన్నల కోసం ఇంకా చేయాల్సింది చాలా ఉంది
  • సిరిసిల్లను అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా
  • సిరిసిల్లను పేరుకు తగ్గట్టుగా ‘సిరి శాల’గా చేస్తా

రాబోయే మూడేళ్లలో సిరిసిల్లలో రైలుకూత వినిపించబోతోందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి స్పష్టం చేశారు. సిరిసిల్లలో పర్యటించిన ఆయన మాట్లాడుతూ, సిరిసిల్ల పట్టణంలోని నేతన్నల కోసం ఇంకా చేయాల్సింది చాలా ఉందని చెప్పారు.

చేనేతకు ఉండే అనుంబంధ రంగాలు, అనుబంధ సంఘాల్లోని కార్మికులను కాపాడుకోవాల్సిన బాధ్యత  తమపై  ఉందని చెప్పారు. సిరిసిల్లలోనే నేతన్న సంక్షేమం కోసం సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం మరింతగా పాటుపడేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. రాష్ట్రంలోనే అగ్రగామి నియోజకవర్గంగా సిరిసిల్లను తీర్చిదిద్దే బాధ్యత తనదని, సిరిసిల్లను పేరుకు తగ్గట్టుగా ‘సిరి శాల’గా తయారు చేస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు. 

More Telugu News