aps RTC: నగదు రహిత టికెట్‌ విధానం వైపు ఏపీ ఎస్ఆర్టీసీ అడుగులు: సంస్థ ఎండీ సురేంద్రబాబు

  • త్వరలో స్వైపింగ్‌ కార్డులు అందుబాటులోకి  
  • అన్ని బస్సుల్లో సీసీ కెమెరాలు
  • 96 శాతం బస్సులకు ట్రాకింగ్‌ సిస్టమ్‌ అమలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) అధునిక సాంకేతిక పరిజ్ఞానం వైపు అడుగులు వేస్తోంది. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే క్రమంలో, ఇకపై టికెట్‌ విధానం కాకుండా స్వైపింగ్‌ కార్డులను ప్రవేశపెట్టనున్నట్లు సంస్థ ఎండీ సురేంద్రబాబు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న ఆయన రాజమహేంద్రవరంలో విలేకరులతో మాట్లాడారు.

ఆర్టీసీలో ప్రయాణించేటప్పుడు టికెట్‌ కోసం నగదు ఇవ్వకుండా కార్డు స్వైప్‌ చేస్తే టికెట్‌ జనరేట్‌ అయిపోతుందన్నారు. టికెట్‌కు చెల్లించాల్సిన మొత్తం కార్డు నుంచి కట్‌ అవుతుందని చెప్పారు. ఆర్టీసీ బస్సుల్లో 96 శాతం వాహనాలకు ఇప్పటికే ట్రాకింగ్‌ సిస్టం అమలవుతోందని, త్వరలో అన్ని బస్సుల్లో సీసీ కెమెరాలు అమర్చనున్నామని తెలిపారు.

More Telugu News