sanjana: ఆపరేషన్ తర్వాత నా ఆరోగ్యం ఇప్పుడు బాగానే వుంది: హీరోయిన్ సంజన

  • ఆపరేషన్ చేయించుకున్నాను 
  • ఆసుపత్రిలో బెడ్ పై వున్నాను 
  • ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి  

కన్నడ .. మలయాళ భాషల్లో కథానాయికగా సంజన మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు తెరకి 'బుజ్జిగాడు' సినిమాతో పరిచయమైన ఈ అమ్మాయి, ఆ తరువాత 'సత్యమేవ జయతే'తో పాటు మరికొన్ని తెలుగు సినిమాలు చేసింది. అలాంటి సంజన ఇటీవల సర్జరీ చేయించుకుంది. ఆ సర్జరీ గురించి ఆమె ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.

తన అండాశయంలో ప్రమాదకరంగా పెరుగుతోన్న 550 ఎమ్ ఎమ్ డెర్మాయిడ్ ను వైద్యులు ఆపరేషన్ చేసి తొలగించారనీ, ఆసుపత్రిలో బెడ్ పై విశ్రాంతి తీసుకుంటున్నానని చెప్పింది. ఈ ఆపరేషన్ కారణంగానే తాను నెలరోజులుగా బయటికి రావడంలేదనీ, ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని అంది. ప్రతి మహిళ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలనీ, 6 నెలలకి ఒకసారైనా అండాశయం .. గర్భాశయాలకి సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలని ఆమె సూచించింది. 

More Telugu News