kalyan ram: సస్పెన్స్ తో కొనసాగిన '118' టీజర్

  • కల్యాణ్ రామ్ నుంచి '118'
  • సస్పెన్స్ ప్రధానంగా సాగే కథ 
  • జనవరిలో భారీ విడుదల  

కల్యాణ్ రామ్ కథానాయకుడిగా గుహన్ దర్శకత్వంలో '118' సినిమా రూపొందింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. జనవరిలో ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో వున్నారు. ముందుగా చెప్పినట్టుగానే కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఫస్టు టీజర్ ను రిలీజ్ చేశారు.

కల్యాణ్ రామ్ .. షాలినీ పాండేకి సంబంధించిన విజువల్స్ పైనే ఈ టీజర్ ను కట్ చేశారు. ముందు వాళ్లు సంతోషకరమైన జీవితాన్ని అనుభవించడం .. ఆ తరువాత అనూహ్యమైన సంఘటనలను ఫేస్ చేయడం ఈ టీజర్ లో కనిపిస్తోంది. మరో కథానాయిక అయిన నివేదా థామస్ రోల్ ను ఎక్కడా రివిల్ చేయకపోవడం విశేషం. టీజర్ అంతా కూడా సస్పెన్స్ ను మెయింటేన్ చేస్తూ కొనసాగింది. టైటిల్ కి తగినట్టుగానే విజువల్స్ కూడా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ సినిమా కల్యాణ్ రామ్ ను కొత్తగా చూపించనుందనే విషయం మాత్రం అర్థమవుతోంది.

More Telugu News