రాహుల్ గాంధీ అసలు పేరు రౌల్ వించీ.. ఆయనకు బ్రిటన్ పౌరసత్వం ఉంది!: సుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు

18-12-2018 Tue 10:34
  • బ్రిటన్ లో రాహుల్ కు బ్యాంకు ఖాతా ఉంది
  • దీనిపై దేశ ప్రజలకు వివరణ ఇవ్వాలి
  • ట్విట్టర్ లో ఆరోపించిన బీజేపీ నేత

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై బీజేపీ నేత, పార్లమెంటు సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి సంచలన ఆరోపణలు చేశారు. రాహుల్ గాంధీ అసలు పేరు రౌల్ వించీ అనీ, ఆయనకు బ్రిటన్ పౌరసత్వం ఉందని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఈ విషయమై తొలుత దేశ ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఈరోజు ఉదయం ట్విట్టర్ లో సుబ్రహ్మణ్య స్వామి స్పందిస్తూ..‘మిస్టర్ రాహుల్ గాంధీ.. భారత ప్రధాని కావాలని కలలు కనేముందు బ్రిటన్ లో మీకున్న రహస్య పౌరసత్వాన్ని, రౌత్ వించీ పేరుతో ఉన్న బ్యాంకు ఖాతా రహస్యాలను దేశ ప్రజల ముందు బయటపెట్టండి’ అని ట్వీట్ చేశారు. కాగా, సుబ్రహ్మణ్య స్వామి చేసిన విమర్శలపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇంతవరకూ స్పందించలేదు.