AAdhar: ఇక దేనికీ ఆధార్ అవసరం లేదు.. చట్టాన్ని మార్చనున్న కేంద్రం

  • ఆధార్ చట్టంలో మార్పులకు కేబినెట్ అంగీకారం
  • బ్యాంకు ఖాతాలకు, సిమ్ కార్డులకు ఆధార్ ఇవ్వక్కర్లేదు
  • డేటా చోరులు, హ్యాకర్లపై కఠిన చర్యలకు కేంద్రం సిద్ధం

ప్రజలకు బోల్డంత ఊరటనిచ్చే వార్త ఇది. బ్యాంకు ఖాతా తెరవాలన్నా, సిమ్ కార్డు తీసుకోవాలన్నా ఆధార్ ఉండాల్సిందే. అది లేకుంటే ప్రభుత్వ పరమైన పనులు కూడా ఆగిపోతున్నాయి. అయితే, ఇకపై వాటితో పని ఉండదు. కేంద్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

అందులో భాగంగా ప్రస్తుతం ఉన్న చట్టంలో కొన్ని మార్పులు చేయడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన సవరణ బిల్లును పార్లమెంటులో పెడతారు. ఇకపై బ్యాంకు, మొబైల్ కనెక్షన్లకు ఆధార్ తప్పనిసరి కాదని, ఆధార్ వివరాలను ఇవ్వాలా? వద్దా? అనేది వినియోగదారుడి విచక్షణకే వదిలి వేస్తారు. అలాగే, హ్యాకర్లు, డేటా ఉల్లంఘనలు, చోరీలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం నిర్ణయించింది.  

More Telugu News