Australia: 15 బంతుల్లోనే చివరి నాలుగు వికెట్లూ... ఓడిపోయిన ఇండియా!

  • 140 పరుగులకే ఆలౌట్ అయిన భారత్
  • 146 పరుగుల తేడాతో ఆసీస్ విజయం 
  • సిరీస్ 1-1తో సమం

అనుకున్నదే జరిగింది. టాప్ ఆర్డర్ విఫలమైన వేళ, బౌలింగ్ కు అనుకూలిస్తున్న పిచ్ పై ఓ వైపు నుంచి స్టార్క్, మరో వైపు నుంచి కుమిన్స్ నిప్పులు చెరిగే బంతులేస్తుంటే, భారత టెయిలెండర్లు చేతులెత్తేశారు. దీంతో 15 బంతుల వ్యవధిలోనే భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 140 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో రెండో టెస్టును ఆస్ట్రేలియా 146 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ ను 1-1తో సమం చేసింది.

భారత్ రెండో ఇన్నింగ్స్ లో కేఎల్ రాహుల్ డక్కౌట్ కాగా, మురళీ విజయ్ 20, పుజారా 6, కోహ్లీ 17, రహానే 30, హనుమ విహారి 28, పంత్ 30, యాదవ్ 2 పరుగులు చేశారు. చివర్లో వచ్చిన ఇషాంత్ శర్మ, బుమ్రా డక్కౌట్ కాగా, మహమ్మద్ షమీకి ఒక్క బాల్ ను కూడా ఎదుర్కొనే అవకాశం దక్కలేదు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, లియాన్ లకు 3 వికెట్ల చొప్పున దక్కగా, హాజెల్ వుడ్, కుమిన్స్ చెరో రెండు వికెట్లు తీశారు.

More Telugu News