samantha: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • శర్వానంద్ కు జోడీగా సమంత
  • వీడియో గేమ్ డెవలపర్ గా తాప్సీ 
  • నిఖిల్ 'ముద్ర' మరోసారి వాయిదా?
  • 'పడిపడి లేచె మనసు'కు క్లీన్ యూ సర్టిఫికేట్    

*  శర్వానంద్ తో సమంత జోడీ కట్టనుంది. తమిళంలో హిట్టయిన '96' చిత్రాన్ని దిల్ రాజు తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇందులో శర్వానంద్, సమంత హీరో హీరోయిన్లుగా నటిస్తారని తాజా సమాచారం.
*  సొట్టబుగ్గల చిన్నది తాప్సీ తాజాగా నటించిన చిత్రం 'గేమ్ ఓవర్'. 'మాయ' ఫేం అశ్విన్ శరవణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తాప్సీ వీడియో గేమ్ డెవలపర్ గా నటిస్తోందట. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
*  నిఖిల్ నటించిన 'ముద్ర' చిత్రం విడుదల మరోసారి వాయిదా పడుతోంది.  ఈ నెల 28న విడుదల కావలసిన ఈ చిత్రాన్ని మళ్లీ వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో లావణ్య త్రిపాఠి కథానాయికగా నటించింది.
*  శర్వానంద్, సాయిపల్లవి జంటగా నటించిన 'పడిపడి లేచె మనసు' చిత్రానికి సెన్సార్ నుంచి క్లీన్ U సర్టిఫికేట్ లభించింది. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఈ నెల 21న విడుదల చేస్తున్నారు.

More Telugu News