warangal: వరంగల్ లో పర్యటించనున్న కేటీఆర్ ..భారీగా ఏర్పాట్లు

  • టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో తొలి పర్యటన
  • ఈ నెల 20న వరంగల్ కు కేటీఆర్
  • స్వాగతం పలికేందుకు భారీగా ఏర్పాట్లు

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ తొలి పర్యటన ఖరారైంది. ఈ నెల 20న ఆయన వరంగల్ లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వరంగల్, జనగామలలోని పార్టీ కార్యాలయాలకు ఆయన శంకుస్థాపన చేస్తారు. అనంతరం, ఏర్పాటు చేసే కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఈ పర్యటన ఏర్పాట్లపై ప్రజాప్రతినిధులతో టీఆర్ఎస్ సీనియర్ నేత కడియం శ్రీహరి సమావేశమయ్యారు. కేటీఆర్ కు స్వాగతం పలికేందుకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.

More Telugu News