kashmir: కశ్మీర్ వివాదంపై ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు

  • కశ్మీర్ ప్రజలను భారత సైన్యం చంపడాన్ని ఖండిస్తున్నాం
  • హింస, హత్యలు సమస్యను పరిష్కరించలేవు
  • కశ్మీర్ లో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలి

కశ్మీర్ వివాదాన్ని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి లేవనెత్తారు. కశ్మీర్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని... ఈ అంశాన్ని ఐక్యరాజ్యసమితిలో లేవనెత్తుతామని ఆయన తెలిపారు. పుల్వామాలో కశ్మీర్ ప్రజలను భారత భద్రతా బలగాలు చంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. కశ్మీర్ వివాదాన్ని హింస, హత్యలు పరిష్కరించలేవని... ఇరు దేశాల మధ్య చర్చలు మాత్రమే పరిష్కారానికి మార్గం చూపుతాయని అన్నారు. కశ్మీర్ లోయలో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని ఐక్యరాజ్యసమితి సెక్యూరిటీ కౌన్సిల్ ను కోరుతామని చెప్పారు. వారి భవిష్యత్తును నిర్ణయించుకునే అవకాశం కశ్మీరీలకే ఇవ్వాలని అన్నారు.

More Telugu News