Pethai: తాళ్లరేవు - కాట్రేనికోన మధ్య తీరం దాటనున్న పెథాయ్.. హుటాహుటిన కదిలిన ఎన్డీఆర్ఎఫ్!

  • తీరం వెంబడి కుంభవృష్టి
  • సాయంత్రం వరకూ ఎవరూ బయటకు రావద్దని హెచ్చరిక
  • పెథాయ్ ప్రభావం గంటపాటు ఉండే అవకాశం

పెథాయ్ గమనాన్ని పరిశీలిస్తూ, అది ఎక్కడ తీరం దాటనుందో వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. తాళ్లరేవు - కాట్రేనికోన మధ్య తీరం దాటుతుందని అధికారులు ప్రకటించడంతో, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకునేందుకు హుటాహుటిన కదిలాయి. ఇప్పటికే తీరం వెంబడి కుంభవృష్టి కరుస్తోంది.

ప్రజలు సాయంత్రం 4 గంటల వరకూ ఇళ్లు దాటి బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. తీరం దాటే సమయంలో నీరు కుమ్మరించినట్టుగా వర్షం కురుస్తుందని, ఈ ప్రభావం సుమారు గంట పాటు ఉంటుందని అంచనా వేస్తున్న అధికారులు, ఆ వెంటనే సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. తీరం దాటిన తరువాత దాని తీవ్రతను బట్టి తదుపరి ఆదేశాలు వెలువరిస్తామని అన్నారు.

More Telugu News