petro price: మళ్లీ పెరుగుతున్న 'పెట్రో' ధరలు!

  • ఎన్నికల సమయంలో నెమ్మదించిన ధరలు 
  • కొత్త ప్రభుత్వాలు ఏర్పడనున్న తరుణంలో పెరుగుదల 
  • శని, సోమవారం పెరుగుదల  

పెట్రో ధరలు మళ్లీ పరుగందుకుంటున్నాయి. ఇటీవల కొన్ని రాష్ట్రాలలో ఎన్నికలు జరిగిన వేళ నెమ్మదించిన ధరలు, ఎన్నికలు ముగిసి ఆయా రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడుతున్న వేళ మళ్లీ పెరుగుతున్నాయి. ఈ క్రమంలో తొలిసారి శనివారం, రెండోసారి నేడు ఇంధనం ధరలు పెరిగాయి. పెట్రోల్‌ ధర 19 నుంచి 20 పైసలు, డీజిల్‌ ధర 9 పైసలు పెరిగింది. గత శనివారం పెట్రోల్‌ ధర స్వల్పంగా 5 పైసలు పెరగగా.. ఆదివారం స్థిరంగా ఉంది.

దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 70.53, డీజిల్‌ ధర రూ. 64.67 పైసలుగా నమోదయ్యింది. తాజాగా ఆర్థిక రాజధాని ముంబయిలో పెట్రోల్‌ ధర రూ. 76.15, కోల్‌కతాలో రూ.72.62, చెన్నైలో రూ. 73.19గా ఉంది. లీటర్‌ డీజిల్‌ ధర ముంబయిలో రూ. 67.47, కోల్‌కతాలో రూ. 66.23, చెన్నైలో రూ. 68.07గా నమోదయ్యింది. డీజిల్‌ ధర మాత్రం రెండు నెలల తర్వాత ఈరోజే తొలిసారిగా పెరిగింది. తాజాగా మరోసారి ముడిచమురు ధర పెరగడంతో ఇంధన ధరలు కూడా మళ్లీ పెరిగాయి.

More Telugu News