sharwanand: శర్వానంద్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా అల్లు అర్జున్

  • శర్వానంద్ .. సాయిపల్లవి జోడీగా ప్రేమకథ 
  • టీజర్ కి .. సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ 
  • ఈ నెల 21వ తేదీన విడుదల      

ప్రేమకథా చిత్రాలను తెరకెక్కించడంలో హను రాఘవపూడి ఇప్పటికే తన ప్రత్యేకతను చాటుకున్నాడు. తన తాజా చిత్రంగా 'పడి పడి లేచె మనసు' ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. శర్వానంద్ .. సాయిపల్లవి జంటగా నటించిన ఈ సినిమా ఈ నెల 21వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ రోజు సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకి హైదరాబాద్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ వేడుకకి అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రానున్నాడు. ఈ ఈవెంట్ కి ఆహ్వానించగానే అల్లు అర్జున్ అంగీకరించడం పట్ల దర్శకుడు హను రాఘవపూడి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ .. ఆయనకి ధన్యవాదాలు తెలియజేశాడు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ కి .. సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా టైటిల్ సాంగ్ జనంలోకి బాగా వెళ్లింది. ఈ సినిమా తప్పకుండా సక్సెస్ ను సాధిస్తుందనే నమ్మకంతో టీమ్ వుంది.

More Telugu News