Miss Univers: మిస్ యూనివర్స్ 2018గా కెట్రియోనా ఎలీసా

  • ఫిలిప్పీన్స్ కు చెందిన కెట్రియోనా ఎలీసా గ్రే
  • ఫస్ట్ రన్నరప్ గా సౌతాఫ్రికా యువతి
  • టాప్-20లో లేని భారత అందాల భామ నేహాల్

ఈ సంవత్సరం మిస్ యూనివర్స్ గా ఫిలిప్పీన్స్ కు చెందిన కెట్రియోనా ఎలీసా గ్రే ఎంపికైంది. బ్యాంకాక్ లో ఆనందోత్సాహాల నడుమ పోటీల ఫైనల్ రౌండ్ జరుగగా, సౌతాఫ్రికాకు చెందిన మెడికల్ స్టూడెంట్ టామరిన్ గ్రీన్ ఫస్ట్ రన్నరప్ గా, వెనిజులాలో న్యాయ విద్యను అభ్యసిస్తున్న స్టెఫానీ గుట్రేజ్ సెకండ్ రన్నరప్ గా నిలిచారు. ఇండియాకు చెందిన నేహాల్ ఫైనల్ 20లో స్థానం సంపాదించుకోవడంలో విఫలమైంది.

కాగా, "నీ జీవితంలో నువ్వు నేర్చుకున్న అత్యంత ముఖ్యమైన పాఠమేంటి?" అన్న ప్రశ్నకు ఎలీసా గ్రే ఇచ్చిన సమాధానం ఆమెకు ఈ కిరీటాన్ని వచ్చేలా చేసింది. తాను మనీలాలోని ఎన్నో స్లమ్ ఏరియాల్లో పర్యటించి పేదరికాన్ని, బాధను స్వయంగా చూశానని, అక్కడి చిన్నారుల ముఖంలో ఆనందాన్ని వెతికానని, వారు బాగుపడితేనే దేశం అభివృద్ధి చెందుతుందని తెలుసుకున్నానని చెప్పింది. వారి పరిస్థితిని మార్చేందుకు తనవంతు కృషి చేస్తానని చెప్పింది.

More Telugu News