Hockey World Cup: హాకీ ప్రపంచకప్ విజేతగా బెల్జియం.. విజయం అందిన వెంటనే ఆటగాళ్ల ఉద్వేగం

  • తొలిసారి ప్రపంచకప్ అందుకున్న బెల్జియం
  • పెనాల్టీ షూటవుట్‌లో తేలిన ఫలితం
  • ఆరో స్థానంతో సరిపెట్టుకున్న భారత్

హాకీ ప్రపంచకప్‌లో బెల్జియం తొలిసారిగా విశ్వవిజేతగా నిలిచింది. ఆదివారం  సాయంత్రం భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో నెదర్లాండ్స్‌తో ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్‌లో బెల్జియం పై చేయి సాధించింది. 3-2 గోల్స్ తేడాతో నెదర్లాండ్స్‌ను మట్టికరిపించి కప్పును ఎగరేసుకుపోయింది. విజయం సాధించిన వెంటనే బెల్జియం ఆటగాళ్లు ఉద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఆట పూర్తి సమయం గడిచినా ఇరు జట్లు గోల్స్ చేయకపోవడంతో విజేతను నిర్ణయించేందుకు పెనాల్టీ షూటవుట్ అనివార్యమైంది. తొలుత బెల్జియం ఓ గోల్ చేయగా, నెదర్లాండ్స్ కూడా గోల్ చేయడంతో 1-1తో రెండు జట్లు సమానమయ్యాయి. రెండో పెనాల్టీలో ఇరు జట్లు విఫలమయ్యాయి. అయితే, మూడు, నాలుగు కిక్‌లను గోల్స్‌గా మలచిన బెల్జియం విజేతగా నిలిచింది. ఫలితంగా పరుషుల హాకీ ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన ఆరో జట్టుగా బెల్జియం రికార్డులకెక్కింది. ఈ టోర్నీలో భారత్ ఆరో స్థానంతో సరిపెట్టుకుంది.

More Telugu News