Rashmika: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • ప్రొఫెసర్ పాత్రలో నటిస్తున్న రష్మిక 
  • పాటల చిత్రీకరణలో 'వీవీఆర్' 
  • దర్శకుడిగా మారిన ఆర్ట్ డైరెక్టర్
  • వచ్చే నెల నుంచి సాయిపల్లవి కొత్త చిత్రం

*  'గీత గోవిందం' చిత్రంతో టాలీవుడ్ లో పేరు తెచ్చుకున్న కథానాయిక రష్మిక మందన తాజాగా కాలేజీ ప్రొఫెసర్ పాత్రలో నటిస్తోంది. 'పొగరు' పేరిట రూపొందుతున్న ఓ కన్నడ చిత్రంలో ఈ చిన్నది ఇలా ప్రొఫెసర్ గా కనిపిస్తుంది.
*  రాం చరణ్, బోయపాటి కాంబినేషన్లో రూపొందుతున్న 'వినయ విధేయ రామ' (వీవీఆర్) చిత్రానికి సంబంధించిన పాటల చిత్రీకరణ ప్రస్తుతం జరుగుతోంది. ఈ 26తో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. జనవరి 11న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్ణయించారు.
*  పలు చిత్రాలకు కళా దర్శకుడిగా పనిచేసిన ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ అశోక్ దర్శకుడిగా మారారు. నూతన నటీనటులతో ఆయన ఓ ప్రేమకథా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దీనికి 'ఇష్టం' అనే టైటిల్ని నిర్ణయించారు.
*  సాయిపల్లవి, రానా జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది. సాయిపల్లవి నక్సలైట్ గా, రానా పోలీస్ ఆఫీసర్ గా నటించే ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెల నుంచి జరుగుతుంది. 

More Telugu News