modi: జాగ్రత్తగా ఉండండి.. అలాంటి పార్టీలకు దూరంగా ఉండండి: మోదీ

  • వారి కోసం పని చేయని వ్యవస్థలన్నింటినీ నాశనం చేశారు
  • వ్యవస్థలు, దేశం కన్నా తామే గొప్పని కాంగ్రెస్ నేతలు భావిస్తుంటారు
  • న్యాయ వ్యవస్థను బలహీనపరిచేందుకు కాంగ్రెస్ ఎంతో యత్నించింది

కీలక వ్యవస్థలను నాశనం చేశారంటూ తమపై విమర్శలు కురిపిస్తున్న కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్ (అలహాబాద్) లో ఆయన ప్రసంగిస్తూ, దేశంలోని వ్యవస్థలు, ప్రజల కన్నా తామే గొప్ప అని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంటుందని దుయ్యబట్టారు. వారి కోసం పని చేయని వ్యవస్థలన్నింటినీ కాంగ్రెస్ నేతలు నాశనం చేశారని మండిపడ్డారు. చట్టం, న్యాయ వ్యవస్థలే కాక దేశం కన్నా తామే ఎక్కువని భావిస్తుంటారని అన్నారు. ఇలాంటి పార్టీలు, నేతలతో జాగ్రత్తగా ఉండాలని, దూరంగా ఉండాలని సూచించారు.

కాంగ్రెస్ నేతల ప్రవర్తన ఇప్పటికీ మారలేదని, రెండు రోజుల క్రితం రాఫెల్ డీల్ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కూడా వారు రాద్ధాంతం చేస్తున్నారని మోదీ మండిపడ్డారు. న్యాయ వ్యవస్థను బలహీనపరిచేందుకు కాంగ్రెస్ ఎంతో ప్రయత్నించిందని... కానీ కోర్టులు వారికి లొంగలేదని...  వారి అవినీతిని ఎండగట్టిందని చెప్పారు. రాజ్యాంగానికి కోర్టులు ఎంతో విలువ ఇస్తాయని... కానీ, అధికారం కోసం వాటిని తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ నేతలు ఎంతో యత్నిస్తున్నారని విమర్శించారు.

More Telugu News