Jana Sena: వేల కోట్లు దోచేయాలనీ, కొడుకును ముఖ్యమంత్రి చేయాలని నేను కలలు కనడం లేదు!: పవన్ కల్యాణ్

  • ఆంధ్రప్రదేశ్ ను మెరుగైన ప్రాంతంగా మారుస్తాం
  • 2019 ఎన్నికల వేళ మార్పు కోసం ప్రయత్నించండి
  • తెలుగు ప్రజలకు కాపాడుకోవడానికి జనసేన ఉంది

వేల కోట్లు దోపిడీ చేయాలనీ, కొడుకును ముఖ్యమంత్రిని చేయాలనీ, వేల ఎకరాలు దోచేయాలని తనకు కలలు లేవని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. భారత్ ను, అందులో ఆంధ్రప్రదేశ్ ను ఓ మెరుగైన ప్రాంతంగా మార్చడమే తన లక్ష్యమన్నారు. అమెరికా నుంచి భారత్ లో అడుగుపెడితే సాదరంగా ఆహ్వానించి, గౌరవించే వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. స్వేచ్ఛగా నచ్చినచోట నిబంధనల మేరకు పరిశ్రమలను ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పిస్తామన్నారు. ఏదో ఒక రోజు ఈ ఆశలన్నీ నెరవేరుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. అమెరికాలోని డల్లాస్ లో జరుగుతున్న ‘జనసేన ప్రవాస గర్జన’ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడారు.

తెలుగు ప్రజలను కాపాడుకోవడానికి ఉన్నామని ధైర్యం చెప్పడానికే జనసేన ప్రధాని కార్యాలయానికి హెచ్1బీ వీసా వ్యవహారంపై లేఖ రాసిందని పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ చర్య ద్వారా ఓట్లు పడతాయా, లేదా? అన్నది పట్టించుకోలేదన్నారు. 2019లో ఎన్నికల నేపథ్యంలో జనసేనకు సాయం చేయాలనుకుంటే ఓ 10-15 రోజులు రావాలని పిలుపునిచ్చారు. మార్పు కోసం పోరాడాలన్నారు. అయితే హెచ్1బీ వీసా ఉన్నవాళ్లు మాత్రం రావాల్సిన అవసరం లేదనీ, దేశం కోసం కెరీర్లను నాశనం చేసుకోవద్దని సూచించారు.

More Telugu News