Andhra Pradesh: నన్ను నమ్మొచ్చా.. అని చాలామందికి డౌట్ వస్తుంది!: పవన్ కల్యాణ్

  • కులాల హాస్టల్స్ పెట్టి పిల్లలను విడగొడుతున్నారు
  • అవినీతి వ్యవస్థలో జనసేన నిలదొక్కుకుంటుంది
  • విదేశీయులు ఉద్యోగాలకు భారత్ కు రావాలి

భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పే నేతలు వాస్తవంలో మాత్రం కులాల వారీగా హాస్టల్స్ కడుతున్నారనీ, చిన్నారులను విడగొడుతున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కామన్ స్కూల్ వ్యవస్థను తీసుకొస్తామని ప్రకటించారు. ప్రస్తుతమున్న అవినీతి వ్యవస్థలో జనసేన నిలదొక్కుకుని నిలబడుతుందని ధీమా వ్యక్తం చేశారు. అలసిపోకుండా పోరాడే యోధులకే  ప్రపంచం లొంగుతుందని వ్యాఖ్యానించారు. అమెరికాలోని డల్లాస్ లో జరిగిన ‘జనసేన ప్రవాస గర్జన’ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడారు.

తనను నమ్మడం చాలా కష్టమనీ, పవన్ కల్యాణ్ ను నమ్మొచ్చా? అని చాలామందికి డౌట్ వస్తుందని జనసేనాని తెలిపారు. తనకు 25 సంవత్సరాల లక్ష్యం ఉందనీ, అందుకోసం కృషి చేస్తున్నానని వెల్లడించారు. చదువుకున్న భారతీయ యువత విదేశాలకు వెళ్లడం కాకుండా విదేశీయులు భారత్ కు వచ్చే పరిస్థితి రావాలన్నారు. స్త్రీలు అన్నిరంగాల్లో ముందుకు దూసుకెళ్లేందుకు, సాధికారత కోసం జనసేన పోరాడుతుందని స్పష్టం చేశారు.

అణుబాంబును కనిబెట్టిన రాబర్ట్ ఒప్పెన్ హైమర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘అణు బాంబుకు సంబంధించి తొలి ప్రయోగం జపాన్ పై జరగలేదు. భారత్ లో ఇది గతంలోనే జరిగింది’ అని చెప్పారన్నారు. అంతటి ఘనమైన చరిత్ర ఉన్న భారత్ కు పూర్వవైభవం తీసుకొద్దామని పిలుపునిచ్చారు.

More Telugu News