Virat Kohli: అంపైర్ తప్పుడు నిర్ణయంతో అవుటైన కోహ్లీ!

  • రెండో టెస్టులో సెంచరీ సాధించిన కోహ్లీ
  • నేలపై పడ్డట్టు కనిపిస్తున్న బంతి
  • అయినా అవుట్ ఇచ్చిన థర్డ్ అంపైర్
  • అసహనం ప్రదర్శిస్తూ వెళ్లిన కోహ్లీ

ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో సెంచరీ సాధించి, అదే ఊపుతో స్కోరును 250 పరుగులు దాటించిన విరాట్ కోహ్లీ, అంపైర్ వివాదాస్పద నిర్ణయంతో అవుటయ్యాడు. 93వ ఓవర్ ను కమిన్స్ వేయగా, చివరి బంతిని కోహ్లీ ఆడాడు. అది ఎడ్జ్ తీసుకుని రెండో స్లిప్ లో ఉన్న హ్యాండ్స్ కోంబ్ చేతుల్లోకి వెళ్లింది.


అయితే, బంతి నేలను తాకినట్టు కనిపించడంతో ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్ కు రిఫర్ చేశారు. బంతి నేలకు తాకిన సమయంలోనే ఫీల్డర్ చేతిలో పడినట్టు రీప్లేలో స్పష్టంగా కనిపిస్తుంటే, బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నాటౌట్ గా ప్రకటించాల్సిన థర్డ్ అంపైర్, అవుటిచ్చాడు. దీంతో మైదానంలోని కోహ్లీ అసహనాన్ని వ్యక్తం చేస్తూ, పెవీలియన్ చేరాడు.

ఆ వెంటనే మహ్మద్ షమీ డక్కౌట్ కాగా, ఆటకు లంచ్ విరామాన్ని ప్రకటించారు. ప్రస్తుతం భారత స్కోరు 7 వికెట్ల నష్టానికి 252 పరుగులు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ తో పోలిస్తే, ఇండియా 74 పరుగుల వెనుకంజలో ఉంది.

More Telugu News