chattisghad: ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ రాజీ ఫార్ములా... ఇద్దరికి చెరో రెండున్నరేళ్లు!

  • నాలుగు రోజుల ఉత్కంఠకు తెర
  • భూపేశ్ బఘేల్ కు తొలుత అవకాశం
  • ఆపై టీపీ సింగ్ దేవ్ కు రెండున్నరేళ్లు
  • సోనియా రంగ ప్రవేశంతో ఫలించిన చర్చలు

చాలాకాలం తరువాత ఛత్తీస్ గఢ్ లో అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్, సీఎం పదవిపై నాలుగు రోజుల ఉత్కంఠకు తెరవేసింది. పార్టీలోని ఇద్దరు సీనియర్ నేతలు భూపేశ్ బఘేల్, టీపీ సింగ్ దేవ్ లకు చెరో రెండున్నరేళ్లు సీఎం పదవిని ఇవ్వాలని అధిష్ఠానం నిర్ణయించింది. రాహుల్ తో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ పీఎల్ పునియాల సమక్షంలో సీనియర్ నేతలు సమావేశమయ్యారు. ఆపై గంటల కొద్దీ చర్చల అనంతరం నిన్న మధ్యాహ్నం తామ్రధ్వజ్ సాహును ఎంపిక చేస్తున్నట్టు చెప్పగానే, సీఎం రేసులో ఉన్న బఘేల్, సింగ్ దేవ్ లు తిరుగుబాటు చేశారు.

దీంతో రంగంలోకి దిగిన సోనియా, ప్రియాంకా గాంధీ, తామ్రధ్వజ్ ను పక్కనబెట్టి, రాజీ ఫార్ములాను తెరపైకి తెచ్చారు. కుర్మి వర్గానికి చెందిన బఘేల్ కు ప్రజల్లో సానుభూతి ఉంది. పైగా పలుకుబడి, ధనిక వర్గాల మద్దతు కూడా పుష్కలం. హస్తినలో ఆయన లాబీయింగ్ బాగానే పని చేసింది. ఇదే సమయంలో రాజ్ పుత్ వర్గానికి చెందిన సింగ్ దేవ్ సైతం, తనదైన శైలిలో పావులు కదిపి రెండున్నరేళ్లు సీఎం అవకాశాన్ని పొందారు.

More Telugu News