kcr: సీఎం కేసీఆర్ కవి, రచయిత.. గ్రంథాలయ ఉద్యమానికి మరింత ప్రాధాన్యమివ్వాలి: వెంకయ్యనాయుడు

  • తెలుగు భాష మీద అభిరుచి, ఆసక్తి ఉన్న వ్యక్తి కేసీఆర్
  • పుస్తకాలను, సాహిత్యాన్ని ఆస్వాదిస్తే ఎంతో సంతోషం
  • హైదరాబాద్ బిర్యానీ తాత్కాలికంగా నోరూరిస్తుంది 

తెలుగు భాష మీద అభిరుచి, ఆసక్తి కలిగిన సీఎం కేసీఆర్ కవి, రచయిత కూడా అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్ లోని ఎన్టీ ఆర్ గ్రౌండ్స్ లో నేషనల్ బుక్ ఫెయిర్ ను ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గ్రంథాలయ ఉద్యమానికి మరింత ప్రాధాన్యత ఇస్తారని తాను ఆశిస్తున్నానని అన్నారు. కేసీఆర్ పుస్తక ప్రియుడు, సాహితీ ప్రియుడు అని, పుస్తకాలను, సాహిత్యాన్ని ఆస్వాదించడం మొదలైతే, అది ఎంత సంతోషంగా ఉంటుందో చెప్పలేమని అన్నారు. మనసు సంతోషంతో ఓలలాడుతుంది. హైదరాబాద్ బిర్యానీ తింటే తాత్కాలికంగా నోరు ఊరొచ్చేమో కానీ, మంచి పుస్తకాన్ని చదివితే ఆనందం ఉంటుంది’ అని చెప్పుకొచ్చారు.

More Telugu News