TRS: టీఆర్ఎస్ లో చేరిన వైరా ఎమ్మెల్యే రాములు నాయక్

  • రాములు నాయక్ కు పార్టీ కండువా కప్పిన కేటీఆర్
  • గిరిజన గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేస్తా
  • వైరాపై కేటీఆర్ దృష్టి పెట్టాలి: రాములు నాయక్

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైరా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన రాములు నాయక్ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయనకు పార్టీ కండువా కప్పి టీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా రాములు నాయక్ మాట్లాడుతూ, గిరిజన గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేస్తానని చెప్పారు. తమ నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. రాజకీయ పార్టీలకు అతీతంగా తనను ప్రజలు ఆశీర్వదించి గెలిపించారని అన్నారు. ఈ గెలుపును ప్రజలకు అంకితం చేస్తున్నానని, అయితే, వైరా నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచాలని భావించే టీఆర్ఎస్ లో చేరానని చెప్పారు. ఇది గిరిజన నియోజకవర్గమా? హైదరాబాద్ సిటీలోని నియోజకవర్గమా? అనేలా అభివృద్ధి చేస్తానని, వైరా నియోజకవర్గంపై కేటీఆర్ దృష్టి పెట్టాలని కోరుతున్నానని అన్నారు. 

More Telugu News