Taimur: కరీనా ముద్దుల తనయుడి పేరుతో సినిమా!

  • చిత్రాన్ని రూపొందించనున్న మధుర్ భండార్కర్
  • ఈ తరం నటులతో సినిమా
  • తైమూర్ పేరును రిజిస్టర్ చేసిన డైరెక్టర్

నెట్టింట్లో బాగా వినిపించే, కనిపించే సెలబ్రిటీల పిల్లల్లో సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్‌ల ముద్దుల తనయుడు తైమూర్ ముందుంటాడు. ముద్దుగా.. చూసేందుకు బొమ్మలా కనిపించే ఈ బుడతడికి ఉన్న క్రేజ్ మాటల్లో చెప్పలేనిది. ఈ చిన్నారి రూపుతో ఉన్న బొమ్మలు కూడా భారీగా అమ్ముడుపోయాయంటే ఆ క్రేజ్ ఏపాటితో ఊహించుకోవచ్చు.

 ప్రస్తుతం తైమూర్ పేరుతో బాలీవుడ్‌లో ఓ సినిమా కూడా తెరకెక్కనుందట. మధుర్ భండార్కర్ ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. పటౌడీ కుటుంబంలోని ఈ తరం నటులతో సినిమాను తెరకెక్కించనున్నట్టు సమాచారం. ఇప్పటికే మధుర్ భండార్కర్ ‘తైమూర్’ అనే పేరును రిజిస్టర్ కూడా చేయించారట. ఇక ఈ వార్తలపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

More Telugu News