tamannah: 'దటీజ్ మహాలక్ష్మి' టీజర్ వచ్చేస్తోంది

  • కంగనాకు పేరు తెచ్చిన 'క్వీన్'
  • వివిధ భాషల్లో రీమేక్ 
  • తెలుగు రీమేక్ లో తమన్నా

హిందీలో కంగనా రనౌత్ చేసిన 'క్వీన్' భారీ విజయాన్ని అందుకుంది. విమర్శకుల నుంచి సైతం ఈ సినిమా ప్రశంసలను అందుకుంది. నటన పరంగా ఈ సినిమా కంగనాను మరోస్థాయికి తీసుకెళ్లింది. అలాంటి ఈ సినిమాను వివిధ భాషల్లో రీమేక్ చేస్తున్నారు. తెలుగు రీమేక్ కి ప్రశాంత్ వర్మ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.

తెలుగులో తమన్నా ప్రధాన పాత్రగా రూపొందిన ఈ సినిమాకి 'దటీజ్ మహాలక్ష్మి'అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నారు. ఇటీవలే షూటింగు పార్టును పూర్తి చేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ నెల 21వ తేదీన ఈ సినిమా నుంచి టీజర్ ను వదలనున్నారు. బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేయనున్నది త్వరలోనే ప్రకటించనున్నారు. 

More Telugu News