sharwanand: ఇప్పటికీ అజ్ఞాత ప్రేమికుడిగానే వున్నాను: హీరో శర్వానంద్

  • శర్వానంద్ నుంచి రొమాంటిక్ లవ్ స్టోరీ 
  • ఆ సీన్స్ నాకు బాగా నచ్చాయి 
  • ఆ విషయాలు చెప్పకూడదు    

శర్వానంద్ కథానాయకుడిగా హను రాఘవపూడి దర్శకత్వంలో 'పడి పడి లేచె మనసు' నిర్మితమైంది. ఈ నెల 21వ తేదీన ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో ఈ సినిమాను గురించి శర్వానంద్ మాట్లాడాడు. ఈ సినిమాలో ఆయన సాయిపల్లవి వైపు నుంచి కొంతసేపు అజ్ఞాత ప్రేమికుడిగా కనిపిస్తాడు. ఆ విషయాన్ని గురించి యాంకర్ ప్రస్తావిస్తూ .. 'నిజ జీవితంలో అజ్ఞాత ప్రేమికుడిగా ఉన్నారా?' అని ప్రశ్నించింది.

ఈ ప్రశ్న శర్వానంద్ ను కాస్త ఇబ్బంది పెట్టింది. కొంచెం సేపు ఆయన ఆలోచించుకుని .. 'అజ్ఞాత ప్రేమికుడిగా వున్నాను .. ఇప్పటికీ' అంటూ సమాధానమిచ్చాడు. 'ఎవరికో తెలుసుకోవచ్చా?' అని యాంకర్ అడిగితే, 'ఆ విషయాలు చెప్పకూడదు' అంటూ తప్పించుకున్నాడు. ఇక ఈ సినిమాకి సంబంధించి .. బోట్ సీన్ .. బస్ లోను .. ట్రైన్ లోను హీరోయిన్ వెంటపడే సీన్స్ తనకి బాగా నచ్చాయని శర్వానంద్ చెప్పుకొచ్చాడు. 

More Telugu News