mehreen: మెహ్రీన్ కి తలనొప్పిగా మారిన అడ్వాన్స్ గొడవ

  • ఆరంభంలో వరుస సక్సెస్ లు 
  • ఇటీవల పలకరిస్తోన్న పరాజయాలు 
  •  చేజారిన అవకాశం  

తెలుగు తెరకి పరిచయమైన అందమైన కథానాయికలలో మెహ్రీన్ ఒకరు. ఆరంభంలో వరుస విజయాలు అందుకున్న ఈ కథానాయికను ఇటీవల పరాజయాలు పలకరిస్తున్నాయి. ఆమె తాజా చిత్రంగా ప్రేక్షకులను పలకరించడానికి 'ఎఫ్ 2' సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సుధీర్ బాబు సరసన ఒక సినిమా చేయడానికి మెహ్రీన్ అంగీకరించింది. ఆ తరువాత ఆ ప్రాజెక్టు నుంచి సుధీర్ బాబు తప్పుకున్నాడు. ఆ నిర్మాతలు హీరోగా చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ ను తీసుకున్నారు.

ఇప్పుడు వాళ్లు  ఆయన జోడీగా మరో హీరోయిన్ ను తీసుకోవాలనుకుంటున్నారు. మెహ్రీన్ కి ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయమని కోరారు. అయితే తన డేట్స్ వేస్ట్ అయ్యాయనీ .. ఆ డేట్స్ కారణంగా రెండు సినిమాలు కూడా వదులుకున్నాననేది మెహ్రీన్ వాదన. దాంతో ఈ గొడవ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కి .. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియోషన్ కి చేరింది. అసలే అవకాశాలు అంతంత మాత్రంగా వుంటే మెహ్రీన్ కి ఈ గొడవ ఒకటి వచ్చి పడింది. 

More Telugu News