#MeToo: రేప్ కేసులో ముందస్తు బెయిలు కోసం దరఖాస్తు చేసుకున్న నటుడు అలోక్ నాథ్

  • అలోక్‌పై లైంగిక ఆరోపణలు చేసిన నిర్మాత నందా
  • రెండు దశాబ్దాల క్రితం లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణ
  • కేసు నమోదైనప్పటి నుంచి అజ్ఞాతంలోకి నటుడు

అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటుడు అలోక్ నాథ్ ముందస్తు బెయిలు కోసం దరఖాస్తు చేసుకున్నారు. రెండు దశాబ్దాల క్రితం అలోక్ నాథ్ తనను లైంగికంగా వేధించాడంటూ రచయిత, నిర్మాత వింటా నందా ఈ ఏడాది అక్టోబరు 17న పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై కేసు నమోదైనప్పటి నుంచి అలోక్ నాథ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తాజాగా, శుక్రవారం డిందోషి కోర్టులో బెయిలు పిటిషన్ దాఖలు చేశారు.

రెండు దశాబ్దాల క్రితం నందా నిర్మించిన టీవీ సీరియల్ ‘తారా’లో అలోక్ నాథ్ ముఖ్యపాత్ర పోషించారు. ఈ సందర్భంగా తనపై లైంగిక దాడికి పాల్పడినట్టు ఇటీవల ఫేస్‌బుక్ ద్వారా నందా వెల్లడించారు.‘మీటూ’ ఉద్యమం నేపథ్యంలో ముందుకొచ్చిన ఆమె ఓషివారా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు అలోక్ నాథ్‌పై కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఆయన అజ్ఞాతంలో ఉన్నారు.

కాగా, నందా ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని అలోక్ నాథ్ కొట్టిపారేశారు. మరోవైపు నందా మాట్లాడుతూ.. అలోక్ నాథ్‌పై తనకు ఎటువంటి కక్ష లేదని, తాను పగతీర్చుకోవడం లేదని స్పష్టం చేశారు. అలోక్ క్షమాపణలు చెబితే వదిలేస్తానని పేర్కొన్నారు.

More Telugu News