TRS: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్.. స్పందించిన బావ హరీశ్ రావు!

  • కుమారుడికి కీలక బాధ్యతలు అప్పగించిన కేసీఆర్
  • శుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రముఖులు
  • హరీశ్ ఇంటికి బయలుదేరిన కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించిన సంగతి తెలిసిందే. ఈ బాధ్యతలను చేపట్టేందుకు కేటీఆర్ సమర్థుడనీ, ఆయన నాయకత్వంలో టీఆర్ఎస్ బలోపేతం అవుతుందని పార్టీ అధినేత కేసీఆర్ వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన కేటీఆర్ కు మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ సహా పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా పార్టీ సారథ్య బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో పార్టీ సీనియర్ నేత కె.కేశవరావుతో కేటీఆర్ సమావేశం కానున్నారు.

కాగా టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడి బాధ్యతలు తీసుకున్న కేటీఆర్ కు బావ, మాజీ మంత్రి హరీశ్ రావు అభినందనలు తెలిపారు. కేటీఆర్ ఈ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగలడని ట్వీట్ చేశారు. దీనిపై వెంటనే కేటీఆర్ స్పందిస్తూ..‘మెనీ థ్యాంక్స్ బావా’ అని జవాబిచ్చారు. కాగా, మరికాసేపట్లో జరగనున్న టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశానికి వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ హాజరుకానున్నారు. మరోవైపు హరీశ్ రావు శుభాకాంక్షలు తెలిపిన నేపథ్యంలో కేటీఆర్ ఆయన ఇంటికి బయలుదేరారు.

More Telugu News