Supreme Court: ‘రాఫెల్’పై రాజకీయ కుట్రలకు తెర’.. సుప్రీంకోర్టు తీర్పుపై అనిల్ అంబానీ హర్షం!

  • రాఫెల్ ఒప్పందంలో తప్పేమీ లేదన్న కోర్టు
  • ఫ్రాన్స్ తో చేసుకున్న ఒప్పందంపై పిటిషన్ల కొట్టివేత
  • ఊరట లభించిందన్న అనిల్ అంబానీ

ఫ్రాన్స్ నుంచి 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో ఎలాంటి అవకతవకలు జరగలేదని ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందంలో అనుమానాస్పద విషయాలేవీ లేవన్న ధర్మాసనం.. రాఫెల్ పై దాఖలైన పిటిషన్లు అన్నింటిని కొట్టివేసింది. సుప్రీంకోర్టు తీర్పును ఇప్పటికే అధికార బీజేపీ స్వాగతించింది.

తాజాగా ఈ ఒప్పందంలో రాఫెల్ కంపెనీ భాగస్వామిగా ఉన్న రిలయన్స్ గ్రూప్ చీఫ్ అనిల్ అంబానీ స్పందించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్లు వెల్లడించారు. రాఫెల్ పై దాఖలైన పిల్స్, పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసిందని తెలిపారు. వ్యక్తిగతంగా తనతో పాటు రిలయన్స్ గ్రూప్ పై రాజకీయ దురుద్దేశాలతో, సాక్ష్యాలు లేకుండా నిరాధార ఆరోపణలు చేశారని వ్యాఖ్యానించారు. తాజాగా కోర్టు తీర్పుతో తమకు ఊరట లభించిందని పేర్కొన్నారు.

More Telugu News