stethoscope: స్టెతస్కోపులతో కూడా ప్రమాదమే: రీసర్చ్ రిపోర్ట్

  • రోగకారణ బ్యాక్టీరియాలతో నిండి ఉంటున్న స్టెతస్కోపులు
  • అంటువ్యాధులను వ్యాపింపజేస్తున్న బ్యాక్టీరియా
  •  జర్నల్ లో వివరాల వెల్లడి

ఏ కారణం వల్ల అయినా మనం ఆసుపత్రికి వెళ్లగానే డాక్టర్ చేసే మొట్టమొదటి పని స్టెతస్కోపుతో మన గుండె ఎలా కొట్టుకుంటుందో చెక్ చేయడం. అయితే, ఈ స్టెతస్కోపులు రోగకారక బ్యాక్టీరియాతో నిండి ఉంటున్నాయని అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్శిటీ పరిశోధకుల అధ్యయనంలో తేలింది.

ఈ బ్యాక్టీరియాలు అంటువ్యాధులను కూడా వ్యాపింపజేస్తున్నాయని వారు తమ రిపోర్ట్ లో పేర్కొన్నారు. పరమాణు శ్రేణిని ఉపయోగించి స్టెతస్కోపులపై ఉన్న బ్యాక్టీరియాను వారు గుర్తించారు. స్టెతస్కోపులను శుభ్రపరిచే పద్ధతులను కూడా సమీక్షించారు. ఇన్ఫెక్షన్ కంట్రోల్ అండ్ హాస్పిటల్ ఎపిడెమియాలజీ జర్నల్ లో వారు ఈ వివరాలను వెల్లడించారు.

More Telugu News