karthi: దుమ్మురేపేస్తోన్న 'దేవ్' సాంగ్

  • కార్తీ కథానాయకుడిగా 'దేవ్' 
  • సంగీత దర్శకుడిగా హారిస్ జైరాజ్ 
  • గీత రచయితగా చంద్రబోస్  

కార్తీ కథానాయకుడిగా రజత్ రవిశంకర్ దర్శకత్వంలో 'దేవ్' సినిమా నిర్మితమైంది. రకుల్ కథానాయికగా నటించిన ఈ సినిమాకి హారిస్ జైరాజ్ సంగీతాన్ని సమకూర్చాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. "చెలియా అడుగుదామా చలిని కాస్త పెరగమని .. సఖియా తెలుపుదామా సుధనే కాస్త పొంగమని .." అంటూ ఈ ఫాస్ట్ బీట్ సాగుతోంది.

కార్తీ .. రకుల్ పై చిత్రీకరించిన ఈ పాటను చంద్రబోస్ రాయగా, హరిహరన్ .. భరత్ సుందర్ .. అర్జున్ చండి .. క్రిష్ .. శరణ్య గోపినాథ్ ఆలపించారు. హారిస్ సంగీతం .. చంద్రబోస్ సాహిత్యం ఈ పాటకు ఊపును .. ఉత్సాహాన్ని తెచ్చాయి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో కార్తీ .. రకుల్ కాంబినేషన్లో వచ్చిన 'ఖాకీ' భారీ విజయాన్ని అందుకుంది. అలాగే 'దేవ్'కూడా తమిళంతో పాటు తెలుగులోను విజయాన్ని సొంతం చేసుకుంటుందేమో చూడాలి.

More Telugu News