petrol: ఎన్నికలు ముగిశాయి... పెట్రో బాదుడు షురూ... రెండు నెలల తరువాత ధరల పెరుగుదల!

  • రెండు నెలల్లో 15 శాతం తగ్గిన ధర
  • పెట్రోలు ధరలను పెంచిన ఓఎంసీలు
  • పెట్రోలుపై 11 పైసల ధర పెరుగుదల

ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే పెట్రోలు ధరల బాదుడు మొదలైంది. రెండు నెలలపాటు తగ్గుతూ వచ్చిన పెట్రోలు, డీజిల్ ధరలు తొలిసారిగా పెరిగాయి. ఈ రెండు నెలల్లో 15 శాతం మేరకు ధరలు దిగిరాగా, ప్రజలు కాస్తంత ఊపిరి పీల్చుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల వేళ, అధికార పార్టీలపై వ్యతిరేకత పెరగకుండా చూసుకునేందుకే పెట్రోలు ధరలను పెంచడం లేదన్న విశ్లేషణలూ వచ్చాయి.

తాజాగా, పెట్రోలుపై 11 పైసలు, డీజిల్ పై 13 పైసల మేరకు ధరను పెంచుతున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెల్లడించింది. దీంతో ముంబైలో పెట్రోలు ధర రూ. 75.91కి పెరిగింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఒపెక్, రష్యాలు రోజుకు 1.2 మిలియన్ బ్యారళ్ల క్రూడాయిల్ సరఫరాను నిలిపివేయాలని, తద్వారా ధరల స్థిరీకరణ సాధ్యమవుతుందని నిర్ణయించడంతో, ఆ ప్రభావం చమురు మార్కెట్ పై పడింది.

More Telugu News