Sai Pallavi: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • నక్సలైట్ పాత్రలో సాయిపల్లవి 
  • పోలీస్ ఆఫీసర్ గా నాని!
  • డబ్బింగ్ చెబుతున్న బాలకృష్ణ 

*  వేణు ఉడుగుల దర్శకత్వంలో రూపొందే చిత్రంలో రానా, సాయిపల్లవి జంటగా నటించనున్నారు. విశేషం ఏమిటంటే, ఇందులో రానా పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుండగా.. సాయిపల్లవి నక్సలైట్ పాత్రను పోషిస్తోంది. త్వరలో షూటింగ్ మొదలవుతుంది.
*  ప్రస్తుతం 'జెర్సీ' చిత్రంలో నటిస్తున్న హీరో నాని త్వరలో ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో మరో చిత్రం చేయనున్నాడు. ఇందులో తను పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషించనున్నట్టు తెలుస్తోంది. ఇందులో మరో హీరో కూడా నటిస్తాడట.
*  క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం ఎన్టీఆర్ బయోపిక్ 'కథానాయకుడు' షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టుకుంది. ఈ క్రమంలో ఎన్టీఆర్ పాత్రధారి బాలకృష్ణ తన డబ్బింగును ప్రారంభించారు.

More Telugu News