shivraj singh couhan: నాకు ముక్తి లభించింది.. ఇప్పుడు స్వేచ్ఛాజీవిని: శివరాజ్ సింగ్ చౌహాన్

  • బీజేపీ ఓటమికి పూర్తి బాధ్యత నాదే
  • కమల్ నాథ్ కు అభినందనలు
  • గవర్నర్ కు రాజీనామా లేఖను అందించిన శివరాజ్ సింగ్

మధ్యప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి 13 ఏళ్ల సుదీర్ఘకాలం పాటు ముఖ్యమంత్రిగా సేవలందించిన శివరాజ్ సింగ్ చౌహాన్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్ కు సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో బీజేపీ ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ విజయంలో కీలకపాత్ర పోషించిన కమల్ నాథ్ కు అభినందనలు తెలిపారు. ఇప్పుడు తనకు ముక్తి లభించిందని, తాను స్వేచ్ఛాజీవినని చెప్పారు.

మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ 114 స్థానాలను కైవసం చేసుకోగా, బీజేపీ 109 స్థానాల్లో గెలుపొందింది. ప్రభుత్వ ఏర్పాటుకు మరో రెండు స్థానాలు అవసరం కాగా, బీఎస్పీ, ఇండిపెండెంట్లు మద్దతు ప్రకటించారు.

More Telugu News