punjab national bank: మెహుల్ ఛోక్సీకి రెడ్ కార్నర్ నోటీసు

  • పీఎన్ బీ స్కామ్ కేసులో ప్రధాని నిందితుడు ఛోక్సీ
  • అరెస్ట్ వారెంట్ జారీ చేసిన ఇంటర్ పోల్
  • యాంటిగ్వాలో తలదాచుకుంటున్న ఛోక్సీ

పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్ బీ) స్కామ్ కేసులో ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీకి ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. సీబీఐ అభ్యర్థన మేరకు చోక్సీకి ఇంటర్ పోల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

కాగా, పదమూడు వేల కోట్ల పీఎన్ బీ స్కామ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో వెలుగులోకి వచ్చింది. ఈ స్కామ్ లో నీరవ్ మోదీ, మెహుల్ ఛోక్సీలు ప్రధాన నిందితులు. ఇది వెలుగులోకి రావడానికి ముందే వీళ్లిద్దరూ దేశం విడిచి పారిపోయారు. ప్రస్తుతం నీరవ్ మోదీ బ్రిటన్ లో ఉన్నట్టు సమాచారం. యాంటిగ్వా పౌరసత్వం తీసుకున్న ఛోక్సీ ఆ దేశంలోనే ఉన్నారు.

రెడ్ కార్నర్ నోటీసు ఇచ్చారంటే ఇంటర్ పోల్ లోని 192 సభ్య దేశాల సరిహద్దుల్లో సదరు నిందితుడు ఎక్కడ కనిపించినా ఆ దేశ పోలీసులు అరెస్టు చేసే అధికారం ఉంది.  నీరవ్ మోదీపై ఈ ఏడాది జులైలో రెడ్ కార్నర్ నోటీసు జారీ అయింది.

More Telugu News