balakrishna: బాలకృష్ణ తదుపరి సినిమా బోయపాటితోనే!

  • ఎన్టీఆర్ బయోపిక్ తో బిజీగా బాలకృష్ణ 
  • చరణ్ మూవీ పనుల్లో బోయపాటి 
  • బోయపాటితో బాలయ్య మూడో సినిమా

బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన 'సింహా'.. 'లెజెండ్' సినిమాలు సంచలన విజయాలను సాధించాయి. బాలకృష్ణ కెరియర్లోనే చెప్పుకోదగిన సినిమాలుగా నిలిచాయి. అలాంటి ఈ ఇద్దరి కాంబినేషన్ మళ్లీ ఎప్పుడు సెట్ అవుతుందా అని అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఎవరి ప్రాజెక్టులతో వాళ్లు బిజీగా ఉండటం వలన కొంత గ్యాప్ వచ్చింది.

ఈ ఇద్దరూ కలిసి త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నారనేది తాజా సమాచారం. ప్రస్తుతం బాలకృష్ణ .. ఎన్టీఆర్ బయోపిక్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు తరువాత ఆయన చేయనున్న సినిమా బోయపాటిదేనని అంటున్నారు. బోయపాటి చేస్తోన్న 'వినయ విధేయ రామ' సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తరువాత ఆయన బాలకృష్ణ ప్రాజెక్టునే పట్టాలెక్కించనున్నాడని చెబుతున్నారు. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గానే ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు ఇద్దరూ సిద్ధమవుతున్నారన్న మాట. 

More Telugu News