FII: లాభాల్లోనే కొనసాగుతున్న మార్కెట్లు !

  • అమ్మకాల ఒత్తిడిలో బీఎస్ఈ, ఎన్ఎస్ఈ
  • ఈక్విటీలను విక్రయిస్తున్న ఎఫ్ఐఐలు
  • ప్రస్తుతం 165 పాయింట్ల లాభంలో సెన్సెక్స్

ఈ ఉదయం మన మార్కెట్లు భారీ లాభాలతో ఓపెన్ అయ్యాయి. అయితే, మార్కెట్ సూచీలు, క్రమంగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు తాజా గరిష్ఠాల వద్ద లాభాల స్వీకరణకు దిగడంతో, దేశవాళీ ఫండ్ సంస్థలు కూడా అదే దారిలో నడిచాయి. దీంతో ఉదయం 9.30 గంటల సమయంలో 36,049 పాయింట్ల వద్ద ఉన్నసెన్సెక్స్ సూచిక, ప్రస్తుతం 12.30 గంటల సమయంలో 35,897 పాయింట్లకు దిగింది.  

ప్రస్తుతం సెన్సెక్స్ సూచిక క్రితం ముగింపుతో పోలిస్తే 165 పాయింట్లు పెరిగి 35,944 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటూ 55 పాయింట్ల లాభంతో 10,792 పాయింట్ల వద్ద నడుస్తోంది. హింద్ పెట్రో, ఇండస్ ఇండ్, బజాజ్ ఫిన్ సర్వ్ తదితర కంపెనీలు లాభాల్లో, యూపీఎల్, సన్ ఫార్మా, టీసీఎస్, కోల్ ఇండియా తదితర కంపెనీలు నష్టాల్లో నడుస్తున్నాయి.

More Telugu News