Telangana: టీఆర్ఎస్ గెలుపు వెనుక మేమున్నాం.. ఇక కేసీఆర్ ఢిల్లీ జైత్రయాత్ర మొదలవుతుంది!: ఒవైసీ

  • ఆదిలాబాద్ లో గణనీయమైన ప్రభావం చూపాం
  • మజ్లిస్-టీఆర్ఎస్ పొత్తుతో సానుకూల ఫలితాలు వచ్చాయి
  • ట్విట్టర్ లో స్పందించిన పార్లమెంటు సభ్యుడు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 88 సీట్లు సాధించడంలో మజ్లిస్ పార్టీ కీలకపాత్ర పోషించిందని ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మజ్లిస్ మద్దతు టీఆర్ఎస్ కు ఎంతగానో ఉపయోగపడిందన్నారు. ఆదిలాబాద్, నిర్మల్, ముదోల్, ఖానాపూర్, సిర్పూర్ ప్రాంతాల్లో మజ్లిస్-టీఆర్ఎస్ పొత్తుతో సానుకూల ఫలితాలు వచ్చాయని అభిప్రాయపడ్డారు.

ఇక కేసీఆర్ ఢిల్లీ జైత్రయాత్ర ప్రారంభమవుతుందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో చాలాచోట్ల బీజేపీ కారణంగా టీఆర్ఎస్ కు భారీగా లాభం చేకూరిందనీ, కమలం పార్టీ కారణంగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయాయని ఒవైసీ చెప్పారు. ముక్కోణపు పోరు కాంగ్రెస్, బీజేపీని చావుదెబ్బ తీసిందన్నారు.

ఆదిలాబాద్ లో టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన జోగు రామన్నకు 73,585 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్ కు 47,154 ఓట్లు, కాంగ్రెస్ నేత జి.సుజాతకు 31,662 ఓట్లు వచ్చాయన్నారు. బీజేపీ కారణంగా కాంగ్రెస్ కు పడాల్సిన ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు రాష్ట్రవ్యాప్తంగా ఈ రకంగానే చీలిపోయాయని వ్యాఖ్యానించారు.

More Telugu News