Goshamahal: గెలిచిన రాజాసింగ్ కన్నా ఎక్కువ ఓట్లొచ్చినా... బీజేపీ అభ్యర్థిని వెంటాడిన దురదృష్టం!

  • గోషామహల్ నుంచి పోటీ చేసి గెలిచిన రాజాసింగ్
  • రాజాసింగ్ కు 61,854 ఓట్లు
  • కరీంనగర్ బీజేపీ అభ్యర్థి సంజయ్ కి 66,009 ఓట్లు
  • అయినా దక్కని గెలుపు

తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ 118 స్థానాల్లో అభ్యర్థులను నిలపగా, కేవలం ఒకే ఒక్క చోట... గోషామహల్ నుంచి రాజాసింగ్ మాత్రమే గెలిచిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఆయనకు 61,854 ఓట్లు వచ్చాయి. బీజేపీ తరఫున పోటీ చేసిన వారిలో రాజాసింగ్ కన్నా అధికంగా ఓట్లను తెచ్చుకుని కూడా విజయలక్ష్మిని వరించలేని వారుండటం గమనార్హం. కరీంనగర్ నుంచి పోటీ చేసి, ఓటమి పాలైన బండి సంజయ్ కి 66,009 ఓట్లు వచ్చాయి.

ఇక అంబర్ పేట నుంచి బరిలోకి దిగిన కిషన్ రెడ్డికి 60,542 ఓట్లు వచ్చినా విజయం దక్కలేదు. కల్వకుర్తిలో పోటీ చేసిన తల్లోజు ఆచారికి 59,445 ఓట్లు, ఆదిలాబాద్ లో పాయల్ శంకర్ కు 47,444 ఓట్లు, ముధోల్ లో రమాదేవికి 40,602 ఓట్లు వచ్చాయి. వీరంతా తాము పోటీ చేసిన నియోజకవర్గాల్లో ఇతర పార్టీల ఓట్లను చీల్చడంలో ప్రధాన పాత్రను పోషించారు.

More Telugu News