Adilabad District: అన్నదాతకు అకాల వర్షం దెబ్బ.. ఆదిలాబాద్‌లో ఏకధాటిగా కురుస్తున్న వాన

  • బుధవారం రాత్రి నుంచి ఆగకుండా జల్లులు
  • పంట చేతికి అందే సమయంలో పరిస్థితితో రైతుకు ఇబ్బంది
  • పంట నీటమునిగి నష్ట భయం

అకాల వర్షం రైతును నట్టేట ముంచింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో బుధవారం రాత్రి నుంచి ఆగకుండా వర్షం కురుస్తుండడంతో రైతులు బెంబేలెత్తిపోతున్నారు. పంట చేతికందే సమయంలో వరుణుడి ప్రతాపం తమ కొంపముంచుతుందని ఆందోళన చెందుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం తుపాన్‌గా మారి ఒకట్రెండు రోజుల్లో కోస్తాకు భారీ వర్ష సూచన ఉందని విశాఖలోని తుపాన్‌ హెచ్చరిక కేంద్రం చెప్పడంతో ఇక్కడ రైతు గుబులు చెందుతున్నారు.

దీని ప్రభావం తెలంగాణపై అంతగా ఉండదని చెప్పడంతో అక్కడి రైతులు కొంత స్థిమిత పడ్డారు. కానీ ఈ అకాల వర్షంతో ఇప్పుడు తీవ్ర వేదనలో కూరుకుపోయారు. నిర్మల్, మంచిర్యాల సహా పలు ప్రాంతాల్లో రాత్రి నుంచి ఆగకుండా వర్షం కురుస్తూనే ఉంది. ప్రస్తుతం వరి పంట కోత దశలో ఉంది. పంట తడిసి ముద్దవుతుండడంతో రైతులు బెంగపడుతున్నారు. ఖానాపూర్, పెబ్బి, కడెం, దసూరాబాద్, జన్నారం మండలాల్లో వరిపంట నీట మునిగింది.  దీంతో రైతులు తలలు పట్టుకుంటున్నారు.

More Telugu News