balakrishna: నిమ్మకూరులో ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో వేడుక

  • ఈ నెల 16వ తేదీన ట్రైలర్ విడుదల 
  • 21వ తేదీన ఆడియో వేడుక 
  • జనవరి 9వ తేదీన భారీ విడుదల       

ఎన్టీఆర్ బయోపిక్ కి సంబంధించిన పనులు చకచకా జరిగిపోతున్నాయి. ఈ సినిమా నుంచి ఎప్పటికప్పుడు వస్తోన్న పోస్టర్స్ .. సాంగ్స్ భారీగా అంచనాలు పెంచేస్తున్నాయి. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 9వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 16వ తేదీన ట్రైలర్ ను రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇక ఎన్టీఆర్ జన్మస్థలమైన నిమ్మకూరులో ఈ నెల 21వ తేదీన ఆడియో వేడుకను నిర్వహించనున్నారు.

ఈ విషయమై స్పష్టమైన ప్రకటన చేస్తూ స్పెషల్ గా ఈ సినిమా టీమ్ ఒక పోస్టర్ ను రిలీజ్ చేసింది. క్రిష్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో రానా .. సుమంత్ .. విద్యాబాలన్ .. రకుల్ .. నిత్యామీనన్ .. హన్సిక తదితరులు ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఎన్నో ప్రత్యేకతలు .. మరెన్నో విశేషాల సమాహారంగా ఈ సినిమా వస్తుండటంతో, అభిమానులంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.       

More Telugu News