Vikarabad District: అధికారులకు అంతుబట్టని రుద్రారం పోలింగ్ బూత్.. మిస్టరీగా మారిన ఓట్లు!

  • ఉన్న ఓట్లకు, పోలైన ఓట్లకు మధ్య తేడా
  • వీవీపాట్ స్లిప్పుల్లోనూ తేలని లెక్క
  • కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన అభ్యర్థులు

వికారాబాద్ సెగ్మెంట్ పరిధిలోని రుద్రారం పోలింగ్ బూత్ ఎన్నికల అధికారులకు మిస్టరీగా మారింది. తొలుత ఇక్కడ పోలైన ఓట్లకు వీవీపాట్ స్లిప్పులకు లెక్క కుదరకపోగా, లెక్కింపులో ఓట్లు తక్కువ రావడం కలకలం రేపుతోంది. అధికారులకు అంతుచిక్కకుండా పోయిన ఆ పోలింగ్ బూత్ నంబరు 183. ఈ బూత్ పరిధిలో 566 ఓట్లు ఉండగా, 518 ఓట్లు పోలయ్యాయి. అయితే, పోలింగ్ ముగిశాక చూస్తే 555 ఓట్లు పోలైనట్టు చూపించింది.

దీంతో ఇక్కడ అవకతవకలు జరిగినట్టు ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి చంద్రశేఖర్ అదే రోజు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో 11న జరిగిన కౌంటింగ్‌లో ఈవీఎంలను పక్కనపెట్టి వీవీపాట్ స్లిప్పులను లెక్కించారు. అయితే, ఈసారి కూడా లెక్కల్లో తేడా వచ్చింది. 504 ఓట్లు మాత్రమే పోలైనట్టు తేలింది. దీంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఉన్న ఓట్లకు, పోలైన ఓట్లకు, వీవీపాట్ స్లిప్పులకు మధ్య తేడా కనిపించడంతో ఇక్కడ బరిలో ఉన్న నేతలు కలెక్టర్‌కు మరోమారు ఫిర్యాదు చేశారు.

More Telugu News