rajani: తెలుగు రాష్ట్రాల్లో 80 కోట్లు రాబట్టిన '2.ఓ'

  • తెలుగు రైట్స్ కోసం పెట్టిన రేటు 80 కోట్లు 
  • ఇంతవరకూ సాధించిన గ్రాస్ 80 కోట్లు 
  • ఇంకా 30 కోట్ల షేర్ రాబడితేనే లాభాలు 

శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన '2.ఓ' ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదలైంది. తెలుగు .. తమిళ భాషలతో పాటు హిందీలోను ఈ సినిమా తన జోరును కొనసాగిస్తోంది. రజనీకాంత్ .. అక్షయ్ కుమార్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో 1400 స్క్రీన్లలో విడుదల చేశారు. తొలివారంలో 68 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా, 13 రోజులకు గాను 80 కోట్లకి పైగా గ్రాస్ ను రాబట్టింది.

 2వ వారంలో 4 సినిమాలు విడుదల కావడం .. స్క్రీన్ల సంఖ్య తగ్గడం '2.ఓ' వసూళ్లపై ప్రభావం చూపిందని అంటున్నారు. ఈ సినిమా తెలుగు రైట్స్ ను సుమారు 80 కోట్లకు కొనడం జరిగింది. ఇంతవరకూ 80 కోట్లకి పైగా గ్రాస్ ను .. 47.69 కోట్ల షేర్ ను రాబట్టింది. ఈ సినిమా లాభాల బాట పట్టాలంటే ఇంకా సుమారు 30 కోట్ల షేర్ ను సాధించవలసి ఉంటుందనేది ట్రేడ్ వర్గాల అంచనా. ఈ స్థాయి షేర్ ను ఈ సినిమా రాబట్టడం అంత తేలికైన విషయం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  

More Telugu News