New Delhi: విభజన చట్టం హామీల అమలుకు టీడీపీ ఎంపీల డిమాండ్‌!

  • పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద ఆందోళన
  • ప్రత్యేక హోదాపైనా గళం విప్పిన పార్లమెంటు సభ్యులు
  • తిత్లీ తుపాన్‌ ప్రభావంపై చర్చించాలని శ్రీకాకుళం ఎంపీ నోటీసు

విభజన చట్టంలో ఆంధ్ర ప్రదేశ్ కు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ  తెలుగుదేశం పార్టీ ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు బుధవారం ఆందోళన నిర్వహించారు. ప్రత్యేక హోదా కూడా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. శీతాకాల సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన ఎంపీలు తొలి రోజే తమ గళం వినిపించారు. ఎంపీలు అశోక్‌గజపతిరాజు, టి.జి.వెంకటేష్‌, మురళీమోహన్‌, శివప్రసాద్‌, కనకమేడల రవీంద్రకుమార్‌, కొనకళ్ల నారాయణ, గల్లా జయదేవ్ ఈ ఆందోళనలో పాల్గొన్నారు.

మరోవైపు శ్రీకాకుళం జిల్లాను ఇటీవల అతలాకుతలం చేసి భారీ నష్టాన్ని మిగిల్చిన తిత్లీ తుపాన్‌ తర్వాత కేంద్రం చేసిన సాయం విషయాన్ని చర్చించాలంటూ శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్‌నాయుడు రూల్‌ 377 కింద నోటీసులు ఇచ్చారు. తుపాన్‌ వల్ల 3,435 కోట్ల మేర నష్టం జరిగితే 539.52 కోట్ల సాయం కేంద్రం విడుదల చేయడంపై ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

More Telugu News