Chhattisgarh: 15 ఏళ్ల బీజేపీ పాలనకు చెక్.. 2003 తర్వాత మళ్లీ చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్

  • వరుసగా మూడు పర్యాయాలు సీఎంగా రమణ్ సింగ్ 
  • మోదీ రికార్డు బద్దలు
  • తాజా ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాభవం

చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ 15 ఏళ్ల నిరీక్షణ ఫలించింది. రాష్ట్రంలోని 90 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 68 స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. అధికార బీజేపీ కేవలం 15 సీట్లకు మాత్రమే పరిమితమైంది. 2003లో చత్తీస్‌గఢ్‌లో అధికారం చేపట్టిన బీజేపీ మూడు పర్యాయాలు ఏకఛత్రాధిపత్యంగా పాలించింది. మళ్లీ ఇన్నాళ్లకు రాష్ట్రంలో అధికార మార్పిడి జరగబోతోంది. 2013లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 39 స్థానాల్లో విజయం సాధించగా, ఇప్పుడు బీజేపీకి అందులోని సగం స్థానాలు కూడా రాకపోవడం గమనార్హం.

15 ఏళ్ల క్రితం డిసెంబరు 7న రమణ్ సింగ్ చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. వరుసగా మూడుసార్లు గద్దెనెక్కి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన బీజేపీ నేతగా రికార్డులకెక్కారు. ఇప్పటి వరకు ఈ రికార్డు ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ పేరుపై ఉంది. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ఏకధాటిగా 4,610 రోజులు పనిచేశారు. రమణ్ సింగ్ ఈ ఏడాది ఆగస్టులో ముఖ్యమంత్రిగా 5 వేల రోజులు పూర్తిచేసుకుని మోదీ రికార్డును బద్దలుగొట్టారు.

More Telugu News